తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎట్టకేలకు లాభాల జోష్​.. నిఫ్టీ@11,300 - stocks

stocks
అంతర్జాతీయ సానుకూలతలతో లాభాల్లో సూచీలు

By

Published : Jul 28, 2020, 10:11 AM IST

Updated : Jul 28, 2020, 3:48 PM IST

15:45 July 28

లాభాలొచ్చాయ్​..

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్​ పడింది. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ షేర్ల దన్నుతో బుల్ మంగళవారం దూకుడు ప్రదర్శించింది.  

సెన్సెక్స్​ 558 పాయింట్లు పుంజుకుని 38,493 వద్దకు చేరింది. నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 11,300 వద్ద స్థిరపడింది.

అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ బ్యాంక్, టీసీఎస్, ఎం&ఎం, ఇండస్​ఇండ్, బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ, ఐటీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:42 July 28

38,300 పైకి సెన్సెక్స్...

మిడ్ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 390 పాయింట్లకుపైగా బలపడి 38,328 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 120 పాయింట్లు పుంజుకుని 11,251 వద్ద ట్రేడవుతోంది.

  • ఆటో, ఐటీ, బ్యాంకింగ్, షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, టీసీఎస్​, మారుతీ, ఎం&ఎం, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ, నెస్లే, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:02 July 28

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్166 పాయింట్లు లాభపడి 38,100 వద్ద ఉండగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 49 పాయింట్ల వృద్ధితో 11,181 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, ఆల్ట్రాటెక్ సిమెంట్ సహా 30 షేర్ల ఇండెక్స్​లోని 21 సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్ సహా 9సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Jul 28, 2020, 3:48 PM IST

For All Latest Updates

TAGGED:

stocks

ABOUT THE AUTHOR

...view details