స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 152 పాయింట్లు పెరిగి 54,555వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 22 పాయింట్ల లాభంతో 16,280 వద్దకు చేరింది.
మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది రెండో సెషన్. టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. విద్యుత్, లోహ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 54,779 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 54,308 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,359 పాయింట్ల గరిష్ఠ స్థాయి (కొత్త రికార్డు), 16,202 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.