తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు- బజాజ్ ఫినాన్స్ జంట షేర్ల జోరు - నిఫ్టీ

ఒడుదొడుకుల సెషన్​ను స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ముగించాయి. సెన్సెక్స్ 32, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడ్డాయి. బజాజ్ ఫినాన్స్ జంట షేర్లు భారీ లాభాలను గడించాయి.

Share market news Telegu
స్టాక్ మార్కెట్ అప్​డేట్స్

By

Published : Apr 29, 2021, 3:49 PM IST

స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్​గా ముగిశాయి. గురువారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ అతి స్వల్పంగా 32 పాయింట్లు పెరిగి 49,765 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ అత్యల్పంగా 30 పాయింట్ల లాభంతో 14,894 వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,375 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,535 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,044 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,814 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫిన్​సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

బజాజ్ ఆటో, ఎస్​బీఐ, హెచ్​సీఎల్​టెక్​, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, హాంగ్​ సెంగ్ సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ నష్టపోయింది. నిక్కీ సెలవులో ఉంది.

ఇదీ చదవండి:పసిడి డిమాండ్ భారత్​లో భళా.. అంతర్జాతీయంగా డీలా!

ABOUT THE AUTHOR

...view details