వరుస లాభాలతో రికార్డుల మోత మోగించిన స్టాక్ మార్కెట్ల జోరుకు బుధవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 163 పాయింట్లు తగ్గి 55,629 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 46 పాయింట్ల నష్టంతో 16,568 వద్ద ముగిసింది.
వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 56,118 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 55,514 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 16,701 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 16,535 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.