అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 177 పాయింట్లు వృద్ధి చెంది 36,021 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 10, 603 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో..
భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, టైటాన్, టీసీఎస్ సహా 30 షేర్ల సూచీ సెన్సెక్స్‌లోని 13 సంస్థల షేర్లు లాభాలతో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, ఎస్బీఐ సహా 11 సంస్థల షేర్లు నష్టాలతో ముగించాయి.
ఆసియా మార్కెట్లు..
షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.