తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరంభ లాభాలు ఆవిరి- సెన్సెక్స్ 323 పాయింట్లు డౌన్ - ఎన్ఎస్ఈ నిఫ్టీ

స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 323 పాయింట్లకుపైగా కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 145 పాయింట్లు దిగజారింది.

Stocks closing
స్టాక్స్​ క్లోజింగ్​

By

Published : Nov 24, 2021, 3:45 PM IST

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 323 పాయింట్లు పతనమై.. 58,341 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 145 పాయింట్ల నష్టంతో 17,358 వద్ద స్థిరపడింది.

ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

58,839 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ 58,968 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు.. క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఒడుదొడుకుల మధ్య జరిగిన ట్రేడింగ్​లో ఓ దశలో 58,143 కనిష్ఠానికి చేరుకుంది.

నిఫ్టీ 17,550 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో 17,354-17,660 మధ్య కదలాడింది.

లాభనష్టాలోనివి ఇవే

ఎన్​టీపీసీ 1.09 శాతం, కొటక్ ​బ్యాంకు 1.09శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 0.92శాతం, పవర్​గ్రిడ్ 0.52 శాతం​, హెచ్​సీఎల్​టెక్ 0.30శాతం​, బజాజ్​ఫైనాన్స్​ 0.27 శాతం లాభాలు గడించాయి.

మారుతీ 2.62శాతం, ఇన్​ఫోసిస్​ 2.42శాతం, ఐటీసీ 1.88శాతం, టెక్​మహీంద్రా 1.84శాతం, ఎల్​ అండ్​టీ 1.81శాతం, రిలయన్స్​ 1.72శాతం, టాటాస్టీల్​ 1.72శాతం, ఇండస్ఇండ్​బ్యాంకు 1.42శాతం అల్ట్రాటెక్​సిమెంట్​ 1.38శాతం ప్రధానంగా నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:'పాత వాహనాలను తుక్కుగా మారిస్తే మరిన్ని ప్రోత్సాహకాలు'

ABOUT THE AUTHOR

...view details