Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జోరుమీదున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ లాభాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగింది. చివరకు 61 వేల 150 వద్ద స్థిరపడింది.
లాభాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ వెనక్కితగ్గలేదు. సెన్సెక్స్ ఇంట్రాడేలో 600 పాయింట్లకుపైగా పెరిగి 61 వేల 218 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి.. 18 వేల 212 వద్ద సెషన్‌ను ముగించింది.
లోహ, విద్యుత్, ఆటో, రియల్టీ రంగం షేర్లు 1 నుంచి 2 శాతం మేర పెరిగాయి. ఐటీ, ఫార్మా షేర్లు ఫ్లాట్‌గా ముగిశాయి.
మొత్తంగా బుధవారం ట్రేడింగ్‌లో 1694 షేర్లు లాభపడ్డాయి. 1554 షేర్లు నష్టపోయాయి.