స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ లాభాల జోరును కొనసాగించాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 446 పాయింట్లు బలపడి 59,745 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 131 పాయింట్ల లాభంతో 17,822 వద్దకు చేరింది. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత లాభాలతో దూసుకెళ్లాయి.
బ్యాంకింగ్, టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 59,778 పాయింట్ల అత్యధిక స్థాయి, 59,127 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,833 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,640 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.