స్టాక్ మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 48,718 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ అతి స్వల్పంగా 3 పాయింట్లు పెరిగి 14,631 వద్ద ఫ్లాట్ గా ముగిసింది.
ఆరంభంలో భారీ నష్టాల్లో ట్రేడైన సూచీలు.. చివరి గంటలో కాస్త పుంజుకున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు సానుకూలంగా స్పందించడం వల్ల భారీ నష్టాల వెనక్కి తగ్గాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,863 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,028 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,673 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,416 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.