దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షల భయాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 375 పాయింట్లు పెరిగి 48,081 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 110 పాయింట్ల లాభంతో 14,406 వద్దకు చేరింది.
ఆరంభంలో నష్టాలు నమోదు చేసిన సూచీలు.. బ్యాంకింగ్ షేర్లు అండతో మిడ్ సెషన్ ముందు లాభాల్లోకి మళ్లాయి. ఫార్మా షేర్లు ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించడం లాభాలు మరింత పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,143 పాయింట్ల అత్యధిక స్థాయి, 47,204 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,424 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,151 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.