తెలంగాణ

telangana

ETV Bharat / business

STOCK MARKETS: సరికొత్త శిఖరాలకు సూచీలు - సెన్సెక్స్​ 550 ప్లస్​ - స్టాక్ మార్కెట్ న్యూస్ టుడే

stock market
స్టాక్ మార్కెట్

By

Published : Oct 14, 2021, 9:40 AM IST

Updated : Oct 14, 2021, 3:27 PM IST

15:11 October 14

జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

మార్కెట్ ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం జీవితకాల గరిష్ఠాలను చేరి కొత్త రికార్డు సృష్టించాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ సెన్సెక్స్ తొలిసారి 61వేల మార్కును దాటింది. 

సెన్సెక్స్ 550 పాయింట్లకుపైగా లాభపడింది. 61,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 175 పాయింట్లు వృద్ధి చెంది 18,338 వద్దకు చేరింది. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి.

11:35 October 14

సరికొత్త గరిష్ఠాలకు సూచీలు..

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు జోరుమీదున్నాయి. సెన్సెక్స్‌ తొలిసారి 61 వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 18,300 మార్కును దాటాయి. సెన్సెక్స్‌ 433 పాయింట్లు పెరిగి 61,170 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు పెరిగి 18,307 వద్ద ట్రేడవుతున్నాయి.

09:11 October 14

స్టాక్​ మార్కెట్ లైవ్ అప్​డేట్స్​

స్టాక్​ మార్కెట్లు(stock market) వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 334 పాయింట్లు వృద్ధి చెంది జీవనకాల గరిష్ఠాన్ని చేరింది. ప్రస్తుతం 61,068 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 111 పాయింట్లు ఎగబాకి.. 18,273 వద్ద కొనసాగుతోంది.

  • సెన్సెక్స్​లోని 30 షేర్ల ఇండెక్స్​లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.68 శాతం లాభపడింది. టెక్​ఎం, ఐటీసీ, ఎల్​ అండ్ టీ, మారుతీ ఎన్టీపీసీ షేర్లు​ రాణిస్తున్నాయి.
  • ఎం అండ్ ఎం, పవర్​గ్రిడ్, భారతీ ఎయిర్​టెల్, బజాజ్​ఫైనాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.
Last Updated : Oct 14, 2021, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details