STOCK MARKETS: మార్కెట్లలో జోష్- సెన్సెక్స్ 130 ప్లస్ - షేర్ మార్కెట్ న్యూస్ తెలుగు
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 125 పాయింట్ల లాభంతో 54,400 ఎగువన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 20 పాయింట్ల లాభంతో 16,250 మార్క్ దాటింది.
09:16 August 12
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
స్టాక్ మార్కెట్లు గురువారం సెషన్‌ను లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 138 పాయింట్లు వృద్ధి చెంది 54,664 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో పవర్ గ్రిడ్ అత్యధికంగా 1.96 శాతం లాభపడింది. ఐటీసీ, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ షేర్లు రాణిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ షేరు పతనం కాగా.. కోటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, సన్‌ఫార్మా షేర్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి.
మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 29 పాయింట్లు ఎగబాకి.. 16,311 వద్ద కొనసాగుతోంది.