తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ సానుకూలతలతో లాభాలు

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్​ ఎక్స్​ఛేంజ్ సూచీ-సెన్సెక్స్​ 168.62 పాయింట్ల వృద్ధితో 39,784.52 వద్ద ముగిసింది. 52.05 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,922 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూలతలతో లాభాలు

By

Published : Jun 10, 2019, 4:13 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఐటీ ​కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బాంబే స్టాక్​ ఎక్స్​ఛేంజ్ సూచీ-సెన్సెక్స్ 168.62 పాయింట్లు బలపడి 39,784.52 వద్ద ముగిసింది. ఇన్​ట్రాడేలో ఓ స్థాయిలో 39,979.48 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది.
జాతీయ స్టాక్​ ఎక్స్​ఛేంజ్​ సూచీ-నిఫ్టీ 52.05 పాయింట్లు లాభపడి 11,922.90 వద్ద ముగిసింది. ఇన్​ట్రాడేలో ఓ స్థాయిలో 11,975.05 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.54 వద్ద అమ్ముడవుతోంది.

లాభాల్లోనివి

బ్రిటానియా, టెక్​ మహీంద్ర, టీసీఎస్​, ఇన్ఫోసిస్​, రెడ్డీస్​ ల్యాబ్య్​ లాభాలను మూటగట్టుకున్నాయి.

నష్టాల్లోనివి

బీపీసీఎల్​, యెస్​ బ్యాంక్​, కోల్​ ఇండియా, గేయిల్​, ఐఓసీఎల్​ వంటి సంస్థలు భారీ నష్టాలతో ముగిశాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details