దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 411 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 40,644 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 128 పాయింట్ల మేర నష్టపోయింది.
కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మరోవైపు ఏజీఆర్ బకాయిలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది.