తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల దన్నుతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

stock markets
భారత్​- చైనా ఉద్రిక్తతలతో ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 19, 2020, 9:58 AM IST

Updated : Jun 19, 2020, 3:43 PM IST

15:37 June 19

దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో, ఇన్​ఫ్రా రంగాలు రాణించడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడమే ఇందుకు కారణం. మరోవైపు రుణ రహిత కంపెనీల జాబితాలోకి చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు​ భారీగా లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 523 పాయింట్లు లాభపడి 34 వేల 731 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 152 పాయింట్లు వృద్ధిచెంది 10 వేల 244 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో

రిలయన్స్ ఇండస్ట్రీస్​, బజాజ్​ ఫైనాన్స్​, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకీ, ఎస్​బీఐ, ఏషియన్ పెయింట్స్ రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, ఐటీసీ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్​, వేదాంత, హెచ్​సీఎల్ టెక్​ నష్టపోయాయి.

12:08 June 19

లాభాల్లోకి మార్కెట్లు...

ఆటో, బ్యాంకింగ్​, ఇన్​ఫ్రా రంగాల ఊతంతో.. స్టాక్​మార్కెట్లు లాభాల బాట పట్టాయి. కోటక్​ మహీంద్రా బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, టాటా మోటార్స్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ దాదాపు 400 పాయింట్లు పెరిగి.. 34 వేల 600 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 10 వేల 210 మార్కు ఎగువన కొనసాగుతోంది. ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, కోల్​ ఇండియా, విప్రో, ఐటీసీ నష్టాల్లో ఉన్నాయి. 

10:24 June 19

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పవనాలు, భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 34,275 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 15 పాయింట్ల వృద్ధితో 10,107 గా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది.

లాభనష్టాల్లో..

30 షేర్ల ఇండెక్స్​లోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్ సహా 10 సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా సహా 20 షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ముడిచమురు..

బ్యారెల్ ముడిచమురు ధర 0.84 శాతం వృద్ధితో 41.86 డాలర్లకు చేరింది.

ఆసియా మార్కెట్లు..

షాంఘై, హాంకాంగ్, టోక్యో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా.. సియోల్ సూచీ నష్టాల్లో ఉంది.  

09:40 June 19

భారత్​- చైనా ఉద్రిక్తతలతో ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ ఆర్థిక పవనాలు, భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్ల స్వల్ప లాభంతో 34,241 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 17 పాయింట్ల వృద్ధితో 10, 109 గా ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లోని టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, హీరో మోటార్ కార్ప్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఐటీసీ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఓఎన్​జీసీ, సన్​ఫార్మా సహా 20 సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Last Updated : Jun 19, 2020, 3:43 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details