తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒడుదొడుకుల మధ్య స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్

sensex
స్టాక్

By

Published : Sep 2, 2020, 9:37 AM IST

Updated : Sep 2, 2020, 10:50 AM IST

10:48 September 02

లాభాల్లోంచి నష్టాల్లోకి..

ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 69, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​-30 ప్యాక్​లో ఓఎన్​జీసీ, టాటా స్టీల్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, భారతీ ఎయిర్​ టెల్​ లాభాల్లో ఉన్నాయి. 

బ్యాంకింగ్​ షేర్లన్నీ కుదేలయ్యాయి. 

09:12 September 02

నష్టాల నుంచి లాభాల్లోకి

దేశీయ స్టాక్ ఎక్స్ఛేజీలు ఒడుదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి భారీగా క్షీణించడం, సరిహద్దులో ఉద్రిక్తతలతో తోడు కరోనా భయాల నడుమ మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  

ఆసియా మార్కెట్లలో బలహీనతలూ దేశీయ సూచీలపై ప్రభావం చూపిస్తున్నాయి. 

స్వల్ప నష్టంతో ప్రారంభమైన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేజీ సూచీ సెన్సెక్స్.. ప్రస్తుతం 77 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. 38,978 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం ఒడుదొడుకుల ప్రయాణమే చేస్తోంది. నష్టాలతో ప్రారంభమైన సూచీ.. తర్వాత లాభాల్లోకి మళ్లింది. 17 పాయింట్ల లాభంతో 11,487 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Sep 2, 2020, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details