తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా రెండోరోజు నష్టాలు- సెన్సెక్స్ 400 డౌన్ - బాంబే స్టాక్ ఎక్సేంజ్​

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల కారణంగా.. దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. దేశీయ మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా సెన్సెక్స్ 400 పాయింట్ల మేర పతనమైంది. మరో సూచీ నిఫ్టీ 104 పాయింట్లు కోల్పోయి 15,208 వద్ద స్థిరపడింది.

stocks close
స్టాక్ మార్కెట్లు

By

Published : Feb 17, 2021, 3:42 PM IST

Updated : Feb 17, 2021, 5:30 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సెషన్​లో.. 30 షేర్లున్న బాంబే స్టాక్ ఎక్సేంజీ-బీఎస్​ఈ 400 పాయింట్ల మేర నష్టపోయింది. మరో సూచీ నేషనల్​ స్టాక్​ ఎక్సేంజీ-ఎన్​ఎస్ఈ 104.55 పాయింట్లు కోల్పోయి.. 15,208 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 52,078 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. 51,586 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 51,703 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ నష్టాల్లో ముగిసింది. తీవ్ర ఊగిసలాట నడుమ చివరకు 15 వేల 208 పాయింట్ల వద్ద ముగిసింది.

లాభాల్లో ఉన్న షేర్లు..

ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, రిలయన్స్, బజాజ్​ ఆటో, భారతి ఎయిర్​టెల్​, ఎం&ఎం, షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లోనివి..

నెస్లే ఇండియా, బజాజ్​ ఫిన్​సర్వ్, ఏషియన్​ పెయింట్స్, ఇండస్​ఇండ్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, మారుతీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఐటీ డౌన్-బ్యాంకింగ్​ అప్​..

ఐటీ, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ సూచీల్లో నెస్లే ఇండియా షేరు ధర 3 శాతం మేర పతనమై.. భారీ నష్టాన్ని చవిచూసింది. మరోవైపు.. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం భారీ లాభాల్లో ట్రేడయ్యాయి.

ఆసియా మార్కెట్ల తీరు..

ఆసియా మార్కెట్లు సైతం అనేక ఊగిసలాటలకు గురయ్యాయి. హాంకాంగ్​ సూచీలు లాభాల్లో ముగియగా.. టోక్యో, సియోల్​ నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చదవండి:భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Last Updated : Feb 17, 2021, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details