తెలంగాణ

telangana

ETV Bharat / business

పోర్ట్​ఫోలియో మార్పులతో ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు - sensex, niofty

బీఎస్​ఈ సూచీలో పోర్ట్​ఫోలియో మార్పులు, బహిరంగ మార్కెట్​లో ఆర్​బీఐ సెక్యూరిటీల అమ్మకం నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా స్టాక్​మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్  2 పాయింట్ల వృద్ధిచెంది 41, 683 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 12, 285 వద్ద ట్రేడవుతోంది.

stocks
పోర్ట్​ఫోలియో మార్పులతో ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : Dec 23, 2019, 10:02 AM IST

Updated : Dec 23, 2019, 10:44 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 30 షేర్ సూచీ సెన్సెక్స్​లో​ పోర్ట్​ఫోలియో మార్పులు, ఆర్​బీఐ రూ. 10 వేల కోట్ల సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్​లో అమ్మకానికి పెట్టడం, లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపిన నేపథ్యంలో నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2 పాయింట్ల పెరిగి 41, 683 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 13 పాయింట్లు వృద్ధి చెంది 12, 285 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు

టాటా స్టీల్, అల్ట్రా టెక్ సిమెంట్, వేదాంత, ఓఎన్​జీసీ, టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, జేఎస్​డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోటక్ బ్యంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు

రిలయన్స్, ఎయిర్​టెల్, టెక్​ మహీంద్రా, గెయిల్, నెస్లీ, బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి క్షీణత

డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 5 పైసలు క్షీణించి 71.17 ను చేరింది. బ్రెంట్ ముడి చమురు ధర 30 శాతం తగ్గి 65.94 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: 2020లో కొత్త ఉద్యోగాలు కష్టమే..!

Last Updated : Dec 23, 2019, 10:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details