తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్​ 257 ప్లస్​ - షేర్ మార్కెట్ న్యూస్

Stocks Live News
స్టాక్స్ లైవ్​ న్యూస్​

By

Published : May 7, 2021, 9:24 AM IST

Updated : May 7, 2021, 3:45 PM IST

15:42 May 07

స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 48,206 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్దకు చేరింది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్​.

  • బజాజ్ ఫిన్​సర్వ్, హెచ్​డీఎఫ్​సీ, ఎం&ఎం, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్​​, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు  ఎక్కువగా నష్టపోయాయి.

12:55 May 07

ఎయిర్​టెల్ 2 శాతం జంప్..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 230 పాయింట్ల లాభంతో 49,176 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా లాభంతో 14,804 వద్ద కొనసాగుతోంది.

  • భారతీ ఎయిర్​టెల్, ఎం ఆండ్ ఎం, ఎన్​టీపీసీ, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్​, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:05 May 07

49,300 పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​లో లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్​ 370 పాయింట్లకుపైగా పెరిగి 49,323 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 110 పాయింట్లకుపైగా లాభంతో 14,837 వద్ద కొనసాగుతోంది. వాహన, ఆర్థిక షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

  • ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టెక్ మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఇన్ఫోసిస్​ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : May 7, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details