తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకింగ్, ఇన్ఫీ ఎఫెక్ట్-ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు! - sensex high

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులు, ఇన్ఫోసిస్ షేర్ల విలువ తగ్గుదల, బ్యాంకింగ్​ ఉద్యోగుల సమ్మె కారణంగా దేశీయ స్టాక్​ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 86 పాయింట్లు తగ్గి 39, 212 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 11, 653 వద్ద కొనసాగుతోంది.

ఒడుదొడుకులతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు!

By

Published : Oct 22, 2019, 10:20 AM IST

అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులు, ఇన్ఫోసిస్ షేర్ల విలువలో భారీ తగ్గుదల, బ్యాంకింగ్​ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో దేశీయ స్టాక్​ సూచీలు ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 86 పాయింట్లు తగ్గి 39, 212 వద్ద కొనసాగుతోంది. 9 పాయింట్ల నష్టంతో 11, 653 వద్ద జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు...

ఎస్ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్​టెల్, ఐసీఐసీఐ, హిందూస్థాన్ యూనిలీవర్, టైటాన్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు...

ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

బలపడిన రూపాయి..

రూపాయి విలువ బలపడింది. డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 27 పైసలు బలపడి 70. 87 గా కొనసాగుతోంది.

ఇదీ చూడండి: బ్యాంకు సేవలకు నేడు పాక్షిక అంతరాయం!

ABOUT THE AUTHOR

...view details