నష్టాల్లో మార్కెట్లు..
మధ్యాహ్నం వరకు లాభాల్లో ఉన్న మార్కెట్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఫలితంగా లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా షేర్లను మదుపర్లు అమ్మకానికి పెట్టారు.
బీఎస్ఈ సెన్సెక్స్ 104 పాయింట్లు పతనమై 45, 855 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 13,442 వద్ద ట్రేడ్ అవుతోంది.