స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1600పాయింట్లకుపైగా కోల్పోయి 52వేల 700 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 430 పాయింట్ల నష్టంతో 15వేల 810 వద్ద ట్రేడవుతోంది.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1600 డౌన్ - స్టాక్ మార్కెట్
14:38 March 07
11:47 March 07
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1200 డౌన్
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఓ దశలో 1700 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్ కాస్త తేరుకుని 1200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. రష్యాపై ఆంక్షలతో ముడి చమురు ధరల ఆకాశాన్నంటుతుండటమూ మార్కెట్ల పతనానికి కారణమవుతోంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1238 పాయింట్ల నష్టంతో 53,095 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ.. 323 పాయింట్లు దిగజారి.. 15,921 వద్ద కొనసాగుతోంది.
09:51 March 07
కుప్పకూలిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. చమురు బ్యారెల్ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
- 1695 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 52,638 వద్ద ట్రేడ్ అవుతోంది.
- మరోవైపు.. 450 పాయింట్ల నష్టంతో 15,794 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది.
09:13 March 07
Stock markets live: స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
Stock markets: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 15,900 దిగువకు చేరింది.
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1404 పాయింట్ల నష్టంతో 52,903 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 378 పాయింట్లు కోల్పోయి 15,866 వద్ద ట్రేడవుతోంది.