తెలంగాణ

telangana

ETV Bharat / business

యుద్ధ భయాలున్నా.. రాణించిన మార్కెట్లు- సెన్సెక్స్​ 380 ప్లస్ - స్టాక్స్ లేటెస్ట్​ న్యూస్

stocks live
స్టాక్స్ లైవ్

By

Published : Feb 28, 2022, 9:23 AM IST

Updated : Feb 28, 2022, 3:50 PM IST

15:48 February 28

క్లోజింగ్ బెల్..

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్​ జోరు కొనసాగింది. దీంతో ఈ వారం తొలి సెషన్​లో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 389పాయింట్లు పెరిగి 56,247 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 16,794 వద్ద సెషన్​ను ముగించింది.

15:24 February 28

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం 56218 వద్ద కొనసాగుతోంది.

అటు నిఫ్టీ సైతం లాభాల్లోనే పయనిస్తోంది. 125 పాయింట్లు లాభపడి.. 16,783 వద్ద ట్రేడవుతోంది.

08:43 February 28

stock markets live updates

ఉక్రెయిన్​- రష్యా యుద్ధ భయాల నేపథ్యంలో స్టాక్​​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 732 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 55,125 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టి 191 పాయింట్ల కోల్పోయి 16,469 వద్ద కదిలాడుతోంది.

లాభానష్టాలు..

  • టైటాన్, సన్​ఫార్మా, ఎంఅండ్ ఎం, ఐటీసీ, టెక్​ మహీంద్రా, రిలయన్స్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
  • టాటాస్టీల్,పవర్​ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలబాట పట్టాయి.
Last Updated : Feb 28, 2022, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details