మార్కెట్లకు లాభాలు..
వరుసగా ఐదో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85, నిఫ్టీ 46 పాయింట్లు చొప్పున పెరిగాయి.
ఇంట్రాడేలో తీవ్ర ఒడుదొడుకుల ట్రేడింగ్ సాగింది.
విప్రో, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.
టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, సన్ ఫార్మా రాణించాయి.