తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్ల వరుస లాభాలకు కళ్లెం​- ఫ్లాట్​గా ముగిసిన సూచీలు - బాంబే స్టాక్​ ఎక్స్చేంజి

Stock markets
స్టాక్​ మార్కెట్లు

By

Published : Feb 9, 2021, 9:24 AM IST

Updated : Feb 9, 2021, 4:27 PM IST

15:37 February 09

ఆఖర్లో ఫ్లాట్​గా..

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఇవాళ్టి ట్రేడింగ్​ను ఫ్లాట్​గా ముగించాయి. ఇంట్రాడేలో రికార్డు స్థాయి గరిష్ఠాలను చేరి.. చివరకు నష్టాలకు మళ్లాయి.

సెన్సెక్స్​ 20 పాయింట్లు నష్టపోయి.. 51 వేల 329 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 వేల 109 వద్ద సెషన్​ను ముగించింది.

11:58 February 09

సరికొత్త శిఖరాలకు సూచీలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​

బడ్జెట్​ తర్వాత దేశీయ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్నాయి. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, హెవీ వెయిట్​ షేర్ల దన్నుతో మంగళవారమూ భారీ లాభాలతో సాగుతున్నాయి.  

బాంబే స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 51,753 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో 51,712 వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ సైతం దూసుకెళుతోంది. 110 పాయింట్ల వృద్ధితో 15,226 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఓఎన్​జీసీ, ఏషియన్​ పేయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​, ఎస్బీఐ లైఫ్​, టైటాన్​ కంపెనీలు 3 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. 

ఐఓసీ, ఎంఅండ్​ఎం, టాటా మోటర్స్​, బజాజ్​ ఆటో, జేఎస్​ డబ్ల్యూ స్టీల్​లు సుమారు 2 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి. 

09:09 February 09

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​.. 179 పాయింట్ల లాభంతో 51,527 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్​లో 51,569 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. కాస్త వెనక్కి తగ్గింది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 47 పాయింట్ల వృద్ధితో 15,163 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లోనివి..

బీపీసీఎల్​, విప్రో, అదానీ పోర్ట్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఇన్ఫోసిస్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

ఐఓసీ, ఎస్బీఐ, శ్రీ సిమెంట్​, యాక్సిస్​ బ్యాంక్​, కొటక్​ మహీంద్రాలు నష్టాల్లోకి వెళ్లాయి.

Last Updated : Feb 9, 2021, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details