తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంక్​ షేర్ల దూకుడు- లాభాల్లోకి సూచీలు - సెన్సెక్స్​

STOCK MARKETS LIVE UPDATES
నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 104 పాయింట్లు మైనస్

By

Published : Jan 12, 2021, 9:28 AM IST

Updated : Jan 12, 2021, 1:20 PM IST

13:11 January 12

బ్యాంక్​ షేర్ల దూకుడు- లాభాల్లోకి సూచీలు

మొదట నష్టాలతో ప్రారంభమైన స్టాక్​మార్కెట్లు.. క్రమక్రమంగా లాభాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడి.. 49,470 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తోంది. 76 పాయింట్లకుపైగా పుంజుకొని 14,561 వద్ద ట్రేడవుతోంది.

12:08 January 12

ఒడుదొడుకుల్లో కొనసాగుతున్న సూచీలు

స్టాక్​మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 49,317 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 37 పాయింట్లు పుంజుకుని  స్వల్ప లాభంతో 14,521 వద్ద కదలాడుతోంది.

  • భారతీ ఎయిర్​టెల్​, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగతున్నాయి.
  • ఏసియన్​ పెయింట్స్​, సన్​ఫార్మా, కోటక్​ బ్యాంక్​,టైటాన్​, హిందుస్థాన్ యూనిలివర్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

08:46 January 12

నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 104 పాయింట్లు మైనస్

స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 49,164 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 23 పాయింట్ల స్వల్ప నష్టంతో 14,460 వద్ద కదలాడుతోంది.

బ్యాంక్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రిలయన్స్​, ఎల్​&టీ,భారతీ ఎయిర్ టెల్​, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్​ లాభాల్లో బాటలో కొనసాగుతున్నాయి. 

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, కోటక్​ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​, ఐసీఐసీఐ, టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Jan 12, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details