తెలంగాణ

telangana

ETV Bharat / business

బుల్​ దూకుడు-310 పాయింట్ల ప్లస్​లో సెన్సెక్స్​ - bse sensex

STOCK MARKETS LIVE UPDATES
ఐటీ, బ్యాంక్​ షేర్లు జోరు- లాభాల్లో సూచీలు

By

Published : Jan 11, 2021, 9:26 AM IST

Updated : Jan 11, 2021, 11:33 AM IST

11:15 January 11

బుల్​ దూకుడు

స్టాక్​ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. ఐటీ, ఫార్మా షేర్లు లాభాల్లో సాగుతున్నాయి. 

సెన్సెక్స్​ 330 పాయింట్లను పుంజుకుని..49,120 వద్ద ట్రేడవుతోంది.  

నిఫ్టీ 50- 72 పాయింట్లుకు పైగా లాభపడి..14,419 వద్ద కొనసాగుతోంది.

09:44 January 11

జీవనకాల గరిష్ఠాన్నితాకిన సెన్సెక్స్​

లాభాల్లో ట్రేడవుతోన్న మార్కెట్లు.. జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. మార్కెట్​ ప్రారంభంలో సెన్సెక్స్​ జీవనకాలం గరిష్ఠం అయిన 49260కు చేరింది. 

ఐటీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా... బ్యాంకు షేర్లు మాత్రం ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

09:07 January 11

ఐటీ​ షేర్ల జోరు- లాభాల్లో సూచీలు

స్టాక్ మార్కెట్లలో బుల్​ దూకుడు ప్రదర్శిస్తోంది. సెన్సెక్స్ 240.76పాయింట్లకుపైగా లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 49,023వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 78 పాయింట్లకుపైగా పెరిగి 14,425 వద్ద కొనసాగుతోంది.

ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలు, విదేశీ మదుపరుల నుంచి వస్తున్న పెట్టుబడుల మద్దతు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

  • హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, టెక్​ మహేంద్ర, ఐటీసీ, హిందుస్థాన్​ యూనిలివర్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • యాక్సిస్​ బ్యాంక్​, సన్​ఫార్మా, బజాజ్​ ఫైనాన్స్​, ఓఎన్​జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Jan 11, 2021, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details