తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు:ప్యాకేజీ ఆశలతో రెండో రోజూ బుల్‌ జోష్ - కరోనా ఇండియా

STOCK MARKETS LIVE UPDATES
కరోనా భయం ఉన్నప్పటికీ.. లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 25, 2020, 9:23 AM IST

Updated : Mar 25, 2020, 5:32 PM IST

17:23 March 25

ప్యాకేజీల ఆశలు..

స్టాక్‌ మార్కెట్లలో వరుసగా రెండో రోజూ బుల్‌ జోష్‌ కొనసాగింది. సెన్సెక్స్ ఏకంగా 1,862 పాయింట్లు బలపడి 28,536 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 517 పాయింట్లు పుంజుకుని 8,318కి చేరింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్‌ డాలర్ల సాయం అందించే ప్యాకేజీపై సెనెట్‌ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు వచ్చారు. భారత్‌ కూడా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ఇస్తుందన్న ఆశలు మదుపరుల సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఈ రెండు అంశాలు మార్కెట్ల భారీ లాభాలకు కారణమయ్యాయి.

15:05 March 25

రిలయన్స్ ఉత్సాహం..

సెషన్ ముగింపునకు ముందు స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,980 పాయింట్లకు పైగా లాభంతో 28,658 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 550 పాయింట్లకు పైగా బలపడి 8,351 వద్ద కొనసాగుతోంది.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్‌ డాలర్ల సాయం అందించే ప్యాకేజీపై సెనెట్‌ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం కారణంగా మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.

రిలయన్స్ ఏకంగా 16 శాతానికి పైగా పుంజుకుంది. కోటక్ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు భారీగా బలపడ్డాయి.  

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్‌జీసీలు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాల్లో ఉన్నాయి.

13:33 March 25

యాక్సిస్‌ బ్యాంక్ అదుర్స్..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం 28,275 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 460 పాయింట్ల లాభంతో 8,258 వద్ద కొనసాగుతోంది.

కరోనావైరస్‌ నేపథ్యంలో ఆర్థిక ఉద్దీపనలు ఉంటాయని కేంద్రం ఇచ్చిన హామీతో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి.

యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 15 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.  

ఐటీసీ, ఎల్&టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:18 March 25

సెన్సెక్స్ 500 పాయింట్లు ప్లస్‌..

స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. మిడ్‌ సెషన్ తర్వాత మదుపరుల సెంటిమెంట్ బలపడి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా హెవీ వెయిట్ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతు లాభాలకు ఊతమందిస్తున్నాయి.

సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు బలపడి తిరిగి 27,170 పాయింట్ల స్థాయికి చేరింది. నిఫ్టీ దాదాపు 140 పాయింట్లు లాభంతో 7,940 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

రిలయన్స్, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, నెస్లే, కోటక్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఎల్‌&టీ, ఓఎన్‌జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:09 March 25

మళ్లీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్థిక ఉద్దీపనలపై ఆశలతో ప్రారంభంలో కాస్త సానుకూలంగా స్పందించిన సూచీలు కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్‌ 110 పాయింట్లకు పైగా నష్టంతో 26,560 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లకు పైగా క్షీణతతో 7,760 వద్ద కొనసాగుతోంది.  

దేశ వ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా చివరి సెషన్‌ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.

09:10 March 25

లాభాలు..

కరోనా భయాలున్నప్పటికీ.. దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. కరోనాపై పోరుకు త్వరలోనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తామన్న కేంద్రం ప్రకటన మార్కెట్లకు ఊతమిచ్చాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 493 పాయింట్ల లాభంతో 27వేల 167 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 133 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 7934 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

Last Updated : Mar 25, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details