తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు బేజారు.. సెన్సెక్స్ 1545 పాయింట్లు డౌన్

MARKETS LIVE UPDATES
MARKETS LIVE UPDATES

By

Published : Jan 24, 2022, 9:18 AM IST

Updated : Jan 24, 2022, 3:44 PM IST

15:42 January 24

Stock market news: స్టాక్​ మార్కెట్​పై బేర్​ పంజా విసిరింది. సెన్సెక్స్ 1545 పాయింట్లు కోల్పోయి 57,491కి పడిపోయింది. నిఫ్టీ 468 పాయింట్లు నష్టపోయి 17,149కి దిగొచ్చింది. ఒక్కరోజులోనే సెన్సెక్స్​, నిఫ్టీ దాదాపు 3శాతం మేర క్షీణించాయి. దీంతో మదపర్ల సంపద రూ.10లక్షల కోట్లు ఆవిరైంది.

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు తప్పదనే సంకేతాలు, రష్యా-ఇక్రెయిన్​ యుద్ధవాతావరణం వంటి కారణాలు మార్కెట్లను కోలుకోలేని దెబ్బతిశాయి. మదుపర్లకు అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల అన్ని రంగాల షేర్లు నష్టాలనే చవిచూశాయి. సిప్లా ఓఎన్​జీసీ షేర్లు మాత్రమే లాభాలను ఆర్జించాయి.

స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు కారణాలు..

  1. గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్ఠాల నుంచి 16 శాతం కుంగడం గమనార్హం. ఈ ప్రభావం సూచీలపై గట్టిగా పడింది. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.
  2. నాస్​డాక్​లో టెక్ స్టాక్‌లు భారీ నష్టాలను చవిచూడడం కూడా మదుపరులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావం ఐటీ రంగంపై పడింది.
  3. మంగళవారం అమెరికాలో ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీరేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్‌.. దాన్ని ఎంత వేగంగా.. ఎన్ని దశల్లో అమలు చేయనుందో ఈ భేటీ స్పష్టం చేయనుంది. ఇదే జరిగితే మార్కెటింగ్​ వ్యవస్థపై గట్టి ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు.
  4. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలోనూ ఫెడ్​ వడ్డీరేట్ల పెంపు వాయిదా లేకపోవడం కూడా మదుపర్లను కలవపరుస్తోంది.
  5. అమెరికాలో నిరుద్యోగం పెరగడం కూడా సూచీలు నష్టాలకు కారణం అయ్యింది.
  6. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపర్లు దృష్టి పెట్టారు. యుద్ధ మేఘాలు కమ్ముకొన్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని రాయబార కార్యాలయ సిబ్బందిని అమెరికా తగ్గించింది.
  7. విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా రూ.12,600 కోట్లకు పైగా అమ్మకాలు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు.
  8. గత ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. లిస్టింగ్‌లో అదరగొట్టిన జొమాటో వంటి షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతుండడం గమనార్హం. ఇక పేటీఎం షేరు ఏకంగా 50 శాతం నష్టంతో కొనసాగుతోంది.
  9. ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ రంగాల షేర్లు మూకుమ్మడిగా డీలా పడటం వల్ల మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి.
  10. ముప్పై షేర్ల ఇండెక్స్​ కూడా పూర్తి స్థాయిలో ఎరుపు రంగు పులుముకోవడం గమనార్హం.

13:59 January 24

స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సెన్సెక్స్ 1650 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 57,382 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అటు నిఫ్టీ సైతం భారీ నష్టాల్లో ఉంది. 486 పాయింట్లు పతనమై.. 17,130 వద్ద ట్రేడవుతోంది.

13:41 January 24

అంతర్జాతీయ సంకేతాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 57,537 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో అన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 6 శాతానికి పైగా నష్టపోయింది.

మరోవైపు, నిఫ్టీ సైతం భారీ నష్టాల్లో ఉంది. 455 పాయింట్లు పతనమై.. 17,162 వద్ద ట్రేడవుతోంది.

11:57 January 24

స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. ప్రస్తుతం 58,036 వద్ద సెన్సెక్స్ కదలాడుతోంది.

నిఫ్టీ 300 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 17,316 వద్ద ట్రేడవుతోంది.

11:32 January 24

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 743 పాయింట్ల మేర పతనమైంది. ప్రస్తుతం 58,293 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, లోహ, ఐటీ, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లు 1 నుంచి మూడు శాతం పడిపోయాయి. బీఎస్​ఈ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు 2 నుంచి 3 శాతం నష్టపోయాయి.

అటు, నిఫ్టీ సైతం భారీగా పతనమైంది. 238 పాయింట్లు కోల్పోయి.. 17,378 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్ షేర్లలో.. టెక్ మహీంద్ర అత్యధికంగా నాలుగున్నర శాతం నష్టపోయింది. విప్రో, టాటాస్టీల్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు భారీగా పతనమయ్యాయి. భారతీ ఎయిర్​టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్ షేర్లు రాణిస్తున్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

10:27 January 24

స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసురుతోంది. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనమైంది. 682 పాయింట్ల నష్టంతో 58,354 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్​లోని 30 షేర్లలో 25 సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి.

నిఫ్టీ సైతం భారీగా పతనమైంది. 219 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుతం 17,397 వద్ద కొనసాగుతోంది.

09:47 January 24

Stock Market Trading today: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రస్తుతం 312 పాయింట్ల నష్టంతో.. 58,724 వద్ద కొనసాగుతోంది.

అటు, నిఫ్టీ సైతం నష్టాల్లోనే ఉంది. 122 పాయింట్లు కోల్పోయి 17,495 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు, ఐటీ, లోహ, ఫార్మా, రియాల్టీ రంగాల షేర్లు మూకుమ్మడిగా డీలా పడటం వల్ల మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

09:05 January 24

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

Stock Market live: అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనమైన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... 218 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 58,818 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం నష్టాలతోనే ప్రారంభమైంది. 42 పాయింట్లు కోల్పోయి.. 17,575 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ 30 షేర్లలో ఐసీఐసీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల బాటపట్టాయి.

Last Updated : Jan 24, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details