Stock Markets: ఒడుదొడుకుల్లో దేశీయ సూచీలు - షేర్ మార్కెట్ లైవ్ న్యూస్
09:00 June 17
15,700 దిగువకు నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 240 పాయింట్లకుపైగా నష్టంతో 52,257 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా కోల్పోయి 15,680 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కీలక వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని 2024 నుంచి 2023కు తగ్గిస్తూ అమెరికా ఫెడ్ నిర్ణయం తీసుకోవడం ప్రతికూలతలు పెంచింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యలో ఈ నిర్ణయం తీసుకుంది ఫెడ్.
- హెచ్‌సీఎల్‌టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.