తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరంభ లాభాలు ఉఫ్​- సెన్సెక్స్ 310 పాయింట్లు పతనం

By

Published : Apr 15, 2020, 9:21 AM IST

Updated : Apr 15, 2020, 3:39 PM IST

stocks live
స్టాక్ మార్కెట్లు లైవ్​

15:38 April 15

స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు పతనమై 30,380 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 69 పాయింట్లు తగ్గి 8,925 వద్ద ముగిసింది.

14:37 April 15

సెన్సెక్స్ 30

నష్టాల్లో మార్కెట్లు..

ఆరంభ లాభాలు ఆవిరై భారీ నష్టాల దిశగా పయణిస్తున్నాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టంతో 30,380 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ దాదాపు 65 పాయింట్లు కోల్పోయి ప్రస్తుతం 8,829 వద్ద ట్రేడవుతోంది. మదుపరులు అమ్మకాలపై దృష్టి సారిస్తుండటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

ఐటీసీ, అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​యూఎల్​, ఎల్​&టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.  

కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, మారుతీ, హీరోమోటోకార్ప్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.

14:02 April 15

తగ్గిన జోరు...

మిడ్​ సెషన్​ తర్వాత స్టాక్​ మార్కెట్లలో లాభాల జోరు తగ్గింది. మదుపరులు ఆరంభ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడటం వల్ల సెన్సెక్స్ ప్రస్తుతం 145 పాయింట్ల స్వల్ప లాభంతో 31 వేల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 30,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 94 పాయింట్ల వృద్ధితో 9,088 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

హెచ్​యూఎల్​, ఎల్&టీ, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్​ఇండ్  బ్యాంక్, నెస్లే షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.  

ఆర్థిక, హహన రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా కోటక్​ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎం&ఎం, మారుతీ, హీరోమోటోకార్ప్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్​ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

13:26 April 15

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 400 పాయింట్లు పెరిగి 31 వేల 90 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 135 పాయింట్లు వృద్ధి చెందింది. ఒక దశలో 9 వేల 200 దాటిన సూచీ.. ప్రస్తుతం 9 వేల 118 వద్ద ఉంది. 

అన్ని రంగాల్లో కొనుగోళ్లతో లాభాలు నమోదవుతున్నాయి. 

యూపీఎల్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, లార్సెన్​, బ్రిటానియా రాణిస్తున్నాయి. 

కోటక్​ మహీంద్రా, ఎం అండ్​ ఎం, జీ ఎంటర్​టైన్​ మెంట్స్​, హెచ్​డీఎఫ్​సీ, హీరో మోటోకార్ప్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

షేర్లు ఇలా...

ఇంట్రాడేలో 1644 షేర్లు పుంజుకున్నాయి. 482 షేర్లు డీలాపడ్డాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 

09:46 April 15

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 590 పాయింట్లకుపైగా లాభంతో ప్రస్తుతం 31,280 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 175 పాయింట్లు పుంజుకుని.. 9,151 వద్దకు చేరింది.

లాభాలకు కారణాలు..

కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వొచ్చనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచాయి. ఈ కాారణంగా కొనుగోళ్లపై మొగ్గుచూపుతున్నారు.

లాభానష్టాల్లోనివి ఇవే..

సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, యాక్సిస్ బ్యాంక్​, ఎల్​&టీ, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్​టీపీసీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. 

కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, మారుతీ షేర్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మొత్తం మీద చూస్తే ఫార్మా, బ్యాంకింగ్​, ఎఫ్​ఎంసీజీ రంగాలు సానుకూలంగా సాగుతున్నాయి.

09:18 April 15

కరోనా ప్యాకేజీపై ఆశలు- సెన్సెక్స్ 600 ప్లస్

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకుపైగా పెరిగి 31 వేల 300 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 170 పాయింట్ల లాభంతో 9 వేల 160 వద్ద కొనసాగుతోంది. 

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం మరో ప్యాకేజీ ప్రకటిస్తుందన్న ఆశలు... నేటి లాభాలకు ప్రధాన కారణం. 

Last Updated : Apr 15, 2020, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details