తెలంగాణ

telangana

ETV Bharat / business

వీడని కరోనా భయాలు.. సెన్సెక్స్​ 600 పాయింట్లు పతనం - స్టాక్​ మార్కెట్లు తాజా వార్తలు

STOCKS
సెన్సెక్స్​

By

Published : Apr 13, 2020, 9:32 AM IST

Updated : Apr 13, 2020, 4:55 PM IST

10:28 April 13

సెన్సెక్స్​ 600 పాయింట్లు పతనం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మాంద్యం భయాలకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో.. ​ రిలయన్స్​ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటి హెవీ వెయిట్​ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. చమురు ఉత్పత్తి తగ్గించేందుకు ఒపెక్​ దేశాలు అంగీకరించటం వల్ల ఆయిల్​ ధరల పెరుగుదలతోనూ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.  

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్​ ఓ దశలో 30,541 పాయింట్ల కనీష్ఠాన్ని తాకి.. ప్రస్తుతం 582 పాయింట్లు నష్టంతో 30,578 వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ  170 పాయింట్లు  కోల్పోయి 8,942 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి...

బజాజ్​ ఫైనాన్స్​ అత్యధికంగా 8 శాతం మేర నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో మహీంద్ర అండ్​ మహీంద్ర, మారుతి, ఓఎన్​జీసీ, టైటాన్​, బజాజ్​ ఆటో షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.  

భారతీ ఎయిర్​టెల్​, ఎల్​అండ్​టీ, ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 8పైసలు క్షీణించి రూ.76.36 వద్ద అమ్ముడవుతోంది.  

09:28 April 13

వెంటాడుతున్న కరోనా భయాలు- సెన్సెక్స్ 400 పాయింట్లు పతనం

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తున్న తరుణంలో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా క్షీణించి 30 వేల 725 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 8 వేల 980 వద్ద కొనసాగుతోంది.

Last Updated : Apr 13, 2020, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details