తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలతో మార్కెట్లకు మళ్లీ నష్టాలే - stocks in losses

sensex live
సెన్సెక్స్

By

Published : Apr 8, 2020, 9:45 AM IST

Updated : Apr 8, 2020, 3:53 PM IST

15:51 April 08

నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

కరోనా ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు నేడు మళ్లీ నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల్లో కొనసాగుతూ.. చివరకు నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాలతో దూసుకెళ్లి 30వేల మార్కును దాటిన సెన్సెక్స్​ ఆ మార్కును కాపాడుకోలేకపోయింది.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​- 173 పాయింట్లు కోల్పోయి 29,893 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 43 పాయింట్లు నష్టంతో 8,749 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

వేదాంత, సన్​ఫార్మా, సిప్లా, సిప్లా, ఎన్​టీపీసీ, భారతీయ ఎయిర్​టెల్​లు లాభాల్లోకి వెళ్లాయి.

టీసీఎస్​, టైటాన్​ కంపెనీ, శ్రీ సిమెంట్​, హిందల్కో, బీపీసీఎల్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి. 

13:01 April 08

మళ్లీ ఒడుదొడుకుల్లోకి...

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల నష్టంతో 30 వేల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 5 పాయింట్లు తగ్గి 8 వేల 785 వద్ద ట్రేడవుతోంది. 

09:48 April 08

నష్టాల నుంచి లాభాల్లోకి..

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్ల వృద్ధితో 30 వేల 520 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 8 వేల 940 వద్ద ట్రేడవుతోంది. 

09:21 April 08

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా మదుపర్లలో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ ఆరంభంలో 464 పాయింట్లు కోల్పోయి 29 వేల 603కు పతనమైంది. ప్రస్తుతం కాస్త కోలుకుని 100 పాయింట్లకుపైగా లాభంతో 30 వేల 200 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 8 వేల 840 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Apr 8, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details