తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ భయాలతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పరిస్థితులతో దేశీయ స్టాక్​ సూచీలు స్వల్ప నష్టాలతో రోజును ఆరంభించాయి. సెన్సెక్స్​ 200 పైగా పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 10 వేల 800 మార్కు దిగువన కొనసాగుతోంది.

అంతర్జాతీయ భయాలతో నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Sep 19, 2019, 9:59 AM IST

Updated : Oct 1, 2019, 4:13 AM IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో రోజును ఆరంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 207 పాయింట్లు కోల్పోయి 36,356 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో 10,785 వద్ద ఉంది.

ఐటీ, విద్యుత్తు, బ్యాంకింగ్​, లోహ రంగాల్లో కొనుగోళ్లు మందగించాయి. ఫలితంగా సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

ముడి చమురు ధరల్లో పెరుగుదల, రూపాయి బలహీనంగా ఉండటం దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య తీసుకునే అవకాశాలు ఉండటం, చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం మార్కెట్లను భయాలు వెంటాడుతున్నాయి.

లాభనష్టాల్లో...

టాటామోటర్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్, విప్రో, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ​

యెస్​ బ్యాంకు, జీ ఎంటర్​టైన్​, టాటాస్టీల్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇండస్​ఇండ్​ బ్యాంకులు నష్టాల్లోకి వెళ్లాయి.

రూపాయి...

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి ఫ్లాట్​గా కొనసాగుతోంది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 71.20 వద్ద ఉంది.

Last Updated : Oct 1, 2019, 4:13 AM IST

ABOUT THE AUTHOR

...view details