తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంక్​ ఫలితాల ప్రభావంతో సూచీలు బేజారు

స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణే ఇందుకు కారణం.

By

Published : Jul 18, 2019, 10:24 AM IST

ఎస్​ బ్యాంక్​ ఫలితాల ప్రభావంతో సూచీలు బేజారు

ఎస్​ బ్యాంక్​ వాటాలపై తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్​మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 50 పాయింట్లు తగ్గి 39 వేల 170 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 11వేల 670వద్ద ట్రేడవుతోంది.

కారణాలివే...

దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఉత్సాహం నింపకపోవడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నష్టాలకు కారణం.

లాభనష్టాల్లో...

తొలి త్రైమాసికంలో లాభం భారీగా తగ్గిపోయినట్లు ఎస్​ బ్యాంక్​ ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ వాటాలు 10శాతానికిపైగా నష్టపోయాయి.

ఓఎన్​జీసీ, టాటా మోటర్స్​, వేదాంత, హెచ్​సీఎల్​ టెక్​, ఎం అండ్​ ఎం, హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్రా, టాటా స్టీల్​, టీసీఎస్​ నష్టాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ ద్వయం, ఐటీసీ, హీరో మోటోకార్ప్, కోటక్ బ్యాంక్​ లాభాల్లో ఉన్నాయి.

రూపాయి... ముడి చమురు...

రూపాయి 4 పైసలు పెరిగి డాలరుతో పోల్చితే 68.77 గా ఉంది.

బ్రెంట్ ముడి చమురు సూచీ 0.27 శాతం పెరిగింది. బ్యారెల్​ ముడి చమురు ధర 63.83 డాలర్లుగా ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details