దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్' కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటమే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 2,713 పాయింట్ల నష్టంతో 31,390 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 758 పాయింట్లు క్షీణించి.. 9,197 వద్ద ముగిసింది.
మార్కెట్లపై కరోనా పంజా- సెన్సెక్స్ 2713 పాయింట్లు పతనం - స్టాక్ మార్కెట్ ముగింపు
స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 2,713 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 758 పాయింట్లు తగ్గింది.
అదే పతనం: కరోనా దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు
మార్కెట్లపై కరోనా పంజా- సెన్సెక్స్ 2713 పాయింట్లు పతనం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి పడిపోయి మాంద్యం ముంచుకొస్తుందన్న అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 2064 పాయింట్లకు పైగా క్షీణించింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ఒకానొక దశలో 500 పాయింట్లకు పైగా క్షీణించింది.
కరోనా వైరస్ దెబ్బకు చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల బాటలోనే ముగిశాయి.