లోహ, ఫార్మా షేర్ల దన్నుతో సోమవారం స్టాక్ మార్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ 296 పాయింట్లు పుంజుకుని 49,502 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో.. 14,942 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండదనే ధీమాకు తోడు.. అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే.. ఈక్విటీ మార్కెట్ల మెరుగైన పనితీరు, మార్చి త్రైమాసిక ఆదాయాలు మార్కెట్లకు లాభాలు తెచ్చిపెట్టినట్లు వివరించారు.
ఇంట్రాడే సాగిందిలా..
బొంబాయి స్టాక్ ఎక్సేంజీ సూచీ 49,412 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని.. 49,617 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-నిఫ్టీ 14,892 పాయింట్ల అత్యల్ప స్థాయిని, 14,967 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.