తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్​బీఐపై ఆశలు.. 4వ రోజు మార్కెట్లకు లాభాలు - stocks closing news

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 163​ పాయింట్లు పెరిగి 41 వేల 306 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 45 పాయింట్ల వృద్ధితో 12 వేల 134 వద్ద ముగిసింది.

stock markets
స్టాక్​ మార్కెట్లు

By

Published : Feb 6, 2020, 4:11 PM IST

Updated : Feb 29, 2020, 10:10 AM IST

రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా... భవిష్యత్​లో తగ్గిస్తుందన్న అంచనాలు స్టాక్​ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఫలితంగా సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో దూసుకెళ్లాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 163​ పాయింట్లు పెరిగి 41 వేల 306 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్ల వృద్ధితో 12 వేల 134 వద్ద స్థిరపడింది.

"ఆర్​బీఐ ప్రకటన ఊహించినదే. ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లను సమీక్షించేందుకు మరింత సమయం పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్​బీఐ 'అకోమొడేటివ్ స్టాన్స్​'ను కొనసాగించింది. అంటే ద్రవ్యోల్బం అదుపులోకి వచ్చాక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఇది నేటి లాభాలకు ప్రధాన కారణం."
-దీప్తి మేరీ మాథ్యూ, ఆర్థికవేత్త-జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్

ఇంట్రాడే సాగిందిలా...

ఉదయం 41 వేల 209 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో హెచ్చుతగ్గులకు గురైంది. 41 వేల 113 పాయింట్ల కనిష్ఠస్థాయికి పతనమైంది. ఆర్​బీఐ ప్రకటన తర్వాత పుంజుకుని 41 వేల 405 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది.

నిఫ్టీ 12 వేల 120 వద్ద ప్రారంభమైంది. 12 వేల 85 పాయింట్ల కనిష్ఠస్థాయి, 12 వేల 160 పాయింట్ల గరిష్ఠస్థాయిని నమోదుచేసింది.

లాభనష్టాల్లో...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​ అత్యధికంగా 4శాతానికిపైగా వృద్ధిచెందింది. ఎస్​బీఐ, బజాజ్ ఫైనాన్స్​, భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్, సన్​ ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్ లాభాల్లో ముగిశాయి.

టైటాన్, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్​ నష్టపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్లు...

ఆసియా మార్కెట్లు దాదాపు 2.88శాతం లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

Last Updated : Feb 29, 2020, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details