తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లపై కరోనా పంజా- 48వేల దిగువకు సెన్సెక్స్ - 30షేర్ల ఇండెక్స్​

కొవిడ్​-19 వ్యాప్తి దృష్ట్యా సోమవారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 883 పాయింట్లు నష్టపోయింది. మరోసూచీ నిఫ్టీ​ 258 పాయింట్లు కోల్పోయి 14,359 వద్ద స్థిరపడింది.

stocks close
స్టాక్​ మార్కెట్లు

By

Published : Apr 19, 2021, 3:47 PM IST

కరోనా మహమ్మారి విజృభణతో స్టాక్​మార్కెట్లు కుప్పకూలాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 883 పాయింట్లకు పైగా నష్టపోయి 47,949 వద్ద సెషన్​ను ముగించింది. నిఫ్టీ 258 పాయింట్లు కోల్పోయి 14,359 వద్ద స్థిరపడింది.

కరోనా భయాలే ప్రధానంగా ట్రేడింగ్​ని కొనసాగించిన సూచీలు.. తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిన తీరు..

సెన్సెక్స్ 48,021 పాయింట్ల అత్యధిక స్థాయిని, 47,362 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 14,382 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,191 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

30షేర్ల ఇండెక్స్​లో డాక్టర్​ రెడ్డీస్​, ఇన్ఫోసిస్​ మినహా.. పవర్​గ్రిడ్, ఇండస్ఇండ్, ఓఎన్​జీసీ, కోటక్ బ్యాంక్, ఏషియన్​ పెయింట్స్, ఎల్​ అండ్​ టీ షేర్లు భారీగా నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details