తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు స్వల్ప లాభాలు- సెన్సెక్స్​ 145 ప్లస్ - షేర్ మార్కెట్ ఇంట్రాడే

దేశీయ స్టాక్​ మార్కెట్ (Stock Market today)​ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుంది.

stocks close
స్టాక్​ మార్కెట్లు

By

Published : Oct 25, 2021, 3:46 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో స్వల్ప లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి.. 60,967 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,125 వద్ద ఫ్లాట్​గా ముగిసింది. సెషన్ మొత్తం ఒడుదొడుకులకు ఎదుర్కొన్న సూచీలు.. బ్యాంకింగ్​ షేర్ల దన్నుతో స్వల్ప లాభాలను నమోదు చేశాయి.

స్థిరాస్తి, వాహన రంగ షేర్లు నష్టపోగా.. బ్యాంకింగ్​ షేర్ల 2 శాతానికిపైగా లాభాలు గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​(Stock Market today) ఉదయం 61,399 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే.. నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 60,449 వద్ద కనిష్ఠాన్ని తాకింది. రోజులో 955 పాయింట్లు కదలాడిన సూచీ.. మరో దశలో 61,404 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 145 పాయింట్ల లాభంతో 60,967 వద్ద ముగిసింది.

మరో సూచీ ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ ఫ్లాట్​గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో..17,968 కనిష్ఠాన్ని తాకి.. బ్యాంకింగ్​ షేర్ల అండతో తిరిగి పుంజుకుంది. ఓ దశలో 18,241 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 10 పాయింట్లతో 18,125 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్ 11.59శాతం, యాక్సిస్​ బ్యాంక్​ 3.56, ఎస్​బీఐఎన్ 0.90, టెక్​మహీంద్రా 0.79, డాక్టర్​ రెడ్డీస్​ 0.71, ఎం అండ్​ ఎం 0.49, హిందుస్థాన్​ యూనిలివర్ 0.11​ లాభాలు గడించాయి.

బజాజ్​ ఫైనాన్స్​ 3.19శాతం, బజాబ్​ ఆటో 2.73, మారుతీ 2.37, హెచ్​సీఎల్​టెక్​ 2.13, ఏషియన్​ పెయింట్స్​ 2.02, ఇండస్​ బ్యాంక్​ 1.74 శాతం నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:స్టాక్‌ మార్కెట్‌లో బఫెట్‌, లించ్‌ పాటించే వ్యూహమిదే!

ABOUT THE AUTHOR

...view details