దేశీయ విపణిలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఆర్థిక రంగ షేర్లు సానుకూల ప్రభావం చూపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగియగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 67 పాయింట్లు పెరిగి 10,311 వద్ద స్థిరపడింది. మిడ్ సెషన్లో 35వేల మార్కును దాటిన సెన్సెక్స్ గరిష్ఠంగా 35,206ను తాకింది.
లాభనష్టాల్లో..
బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, నెస్లే షేర్లు లాభాలతో ముగిశాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఓఎన్జీసీ, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 17 పైసలు బలపడి రూ. 76కు చేరింది.