దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1,030 పాయింట్లు బలపడి 50,781 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 281 పాయింట్ల లాభంతో 14,988 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంక్, అన్ని పెద్ద కంపెనీల షేర్లు లాభాలను గడించాయి.
సాంకేతిక కారణాల వల్ల నిఫ్టీలో ఉదయం 11:40 గంటల నుంచి ట్రేడింగ్ నిలిపివేశారు. సమస్య పరిష్కారం అయ్యాక సాయంత్రం 3:45 గంటల నుంచి ట్రేడింగ్ పునఃప్రారంభించారు. నిఫ్టీతో పాటు సెన్సెక్స్ సమయాన్ని సైతం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,881 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,649 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.