తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 3:52 PM IST

ETV Bharat / business

మార్కెట్లకు లాభాల పంట- సెన్సెక్స్ +553

అమెరికా ఎన్నికల భయాలను బేఖాతరు చేస్తూ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపగా దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 550 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 12వేల 200పైకి చేరింది.

Stock markets close
లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు

బ్యాంకు షేర్ల దూకుడుతో పాటు.. అమెరికా ఎన్నికల భయాలను బేఖాతరు చేస్తూ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపటం వల్ల దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 500 పాయింట్లకు పైగా లాభపడింది. ఇవాళ దేశీయ సూచీలు 9 నెలల గరిష్ఠాన్ని తకాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 553 పాయింట్లు లాభంతో 41,893 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 143 పాయింట్ల వృద్ధితో 12,263 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివి..

బజాజ్​ ఫిన్​సర్వ్​, రిలియన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కొటక్​ మహీంద్ర బ్యాంక్​ లాభపడ్డాయి.

మారుతీ సుజూకీ, గేయిల్​, భారతీ ఎయిర్​టెల్​, గ్రాసిమ్​, ఏషియన్​ పేయింట్స్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 28 పైసలు బలపడి రూ. 74.08 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి: త్వరలో భారత్​కు 15 వేల టన్నుల ఉల్లి!

ABOUT THE AUTHOR

...view details