తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ప్యాకేజీపై ఆశలు- సెన్సెక్స్​ 1,266 పాయింట్లు ప్లస్ - stock markets news etv bharat

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్నఅంచనాలతో సెన్సెక్స్ 12 వందల పైగా పాయింట్ల లాభం నమోదు చేసింది. 363 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ... 9112 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

senxex nifty closing
సెన్సెక్స్ నిఫ్టీ న్యూస్

By

Published : Apr 9, 2020, 3:46 PM IST

Updated : Apr 9, 2020, 3:59 PM IST

లాక్​డౌన్ ముగియడానికి ముందు కేంద్రం మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందన్న అంచనాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ప్రభావం తగ్గుతోందన్న విశ్లేషణలు సైతం మదుపర్లలో ఉత్సాహం నింపాయి. దీంతో దేశీయ స్టాక్​మార్కెట్లు భారీ లాభాలు నమోదు చేశాయి.

1266 పాయింట్లు లాభపడిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 31,160 వద్ద ముగిసింది. వాహన రంగ షేర్లు ఆకాశమే హద్దుగా చెలరేగాయి. మహీంద్ర అండ్ మహీంద్ర 15 శాతం, మారుతీ 12 శాతం, హీరో మోటోకార్ప్ 9.63 శాతం లాభపడ్డాయి.

వీటితో పాటు టైటాన్, బజాజ్ ఫైనాన్స్ సహా బ్యాంకింగ్ రంగ సంస్థలైన హెచ్​డీఎఫ్​సీ, కోటక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్​ల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర, హిందూస్థాన్ యూనిలివర్ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ సైతం లాభాల్లోనే

సెన్సెక్స్ బాటలోనే పయనించిన నిఫ్టీ... భారీ లాభాలు నమోదు చేసింది. 363 పాయింట్లు వృద్ధి చెంది 9112 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీలోని 50 షేర్లలో 6 మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.

Last Updated : Apr 9, 2020, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details