తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ షేర్లు ఢమాల్​- మార్కెట్లకు స్వల్ప నష్టాలు

అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 19 పాయింట్లు కోల్పోయింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 15,817 వద్ద స్థిరపడింది.

STOCKS CLOSE
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు

By

Published : Jul 6, 2021, 3:52 PM IST

స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 19 పాయింట్లు కోల్పోయి 52,861 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 15,817 వద్దకు చేరింది. అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు.. దేశీయంగా కరోనా కేసులు పెరగొచ్చనే భయం మదుపరులను వెంటాడినట్లు మార్కెట్ నిపుణులు తెలిపారు.

లాభనష్టాల్లోనివి ఇవే..

అల్ట్రాటెక్​ సిమెంట్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్​సర్వ్, కోటక్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

టెక్​ మహీంద్ర​, టీసీఎస్, మారుతీ, రిలయన్స్​, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details