తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు చమురు సెగ- సెన్సెక్స్​ 571 పాయింట్లు డౌన్ - ఎన్​ఎస్​ఈ నిఫ్టీ

Stock Market Today: స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 571 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 172 పాయింట్లు తగ్గింది. బ్యాంకింగ్​, క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ, చమురు, విద్యుత్​ రంగాల షేర్లు భారీ నష్టాలను నమోదు చేశాయి.

stocks closing
స్టాక్​ మార్కెట్లు

By

Published : Mar 21, 2022, 3:40 PM IST

Stock Market Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి చమురు ధరలు పెరుగుతుండడం మదుపర్లను కలవరపెడుతోంది. గతవారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్‌ చమురు ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరింది. దీంతో పాటు స్వల్పకాలంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు, పలు దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ల విధింపు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో దేశీయ స్టాక్​ మార్కెట్ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

  • బీఎస్​ఈ సెన్సెక్స్​ 571 నష్టంతో 57,292 వద్ద ముగిసింది.

58,030 వద్ద ప్రారంభమై స్వల్ప లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. ఒక దశలో 58, 127 గరిష్ఠానికి తాకిన సెన్సెక్స్ ఆ తర్వాత 57,229 కనిష్ఠానికి చేరింది.

  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 17,117 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ.. 17,329 పాయింట్ల వద్ద ప్రారంభమవగా.. 17,353 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. మళ్లీ డీలా పడిపోయింది. నిఫ్టీ.. ఓ దశలో కనిష్ఠంగా 17,096 పాయింట్లకు చేరింది.

బ్యాంకింగ్​, క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ, చమురు, విద్యుత్​ రంగాల షేర్లు నష్టాల బాట పట్టడం మార్కెట్​పై ప్రభావం చూపించింది. మరోవైపు ఫార్మా, స్టీల్​ రంగాల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు.

లాభనష్టాల్లోనివి...

కోల్​ఇండియా, హిందాల్​కో, యూపీఎల్​, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ షేర్లు లాభాలు నమోదు చేశాయి.

బ్రిటానియా, గ్రాసిమ్​, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ లైఫ్​, టాటా కంజ్యూమర్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ఇదీ చూడండి :క్లోవియాలో 89శాతం వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్‌ రిటైల్‌

ABOUT THE AUTHOR

...view details