స్టాక్మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. ఐటీ, ఆటో, లోహ రంగం షేర్ల అండతో సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆఖర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపగా లాభాలు పరిమితమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 60 వేల 737 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్లు పెరిగి 18 వేల 162కి చేరింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 60,837 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,452 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 18,198 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 18,051 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.