భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..
మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడుతుండటంతో.. స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 49 వేల మార్కును కోల్పోయింది.
700 పాయింట్లకుపైగా నష్టంతో.. 48 వేల 920 వద్ద కొనసాగుతోంది.
13:53 January 22
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..
మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడుతుండటంతో.. స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 49 వేల మార్కును కోల్పోయింది.
700 పాయింట్లకుపైగా నష్టంతో.. 48 వేల 920 వద్ద కొనసాగుతోంది.
13:04 January 22
సెన్సెక్స్ 600 పాయింట్లు మైనస్..
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు కోల్పోయింది.
బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి.
బ్యాంకింగ్ రంగం షేర్లు కుదేలయ్యాయి.
12:28 January 22
బజాజ్ ఆటో జోరు..
స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకుపైగా నష్టంతో 49 వేల 300 దిగువన ట్రేడవుతోంది.
అయినా.. బజాజ్ ఆటో షేర్లు 10 శాతానికిపైగా లాభపడ్డాయి. ప్రస్తుతం 11 శాతం వృద్ధి చెంది 4,115 వద్ద ఉంది.
11:14 January 22
భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా కోల్పోయింది. ప్రస్తుతం 49 వేల 200 దిగువన ఉంది.
నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 14 వేల 500 దిగువన ఉంది.
బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్, శ్రీ సిమెంట్స్ లాభాల్లో ఉన్నాయి.
యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ భారీగా నష్టపోయాయి.
10:26 January 22
49 వేల 500 దిగువకు సెన్సెక్స్..
స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయి.. 49 వేల 470 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ27 పాయింట్ల నష్టంతో 14 వేల 560 వద్ద కొనసాగుతోంది.
08:44 January 22
నష్టాల్లో మార్కెట్లు- 49 వేల 350 దిగువకు సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 78 పాయింట్లు కోల్పోయి 49 వేల 545 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 14 వేల 580 వద్ద ఉంది.
లాభనష్టాల్లోనివివే..
టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం లాభాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి.