తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market today: మూడోరోజూ మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 372 మైనస్​ - stock market news today

stocks-live
స్టాక్​ మార్కెట్లు లైవ్​ అప్​డేట్స్​

By

Published : Nov 18, 2021, 9:38 AM IST

Updated : Nov 18, 2021, 3:44 PM IST

15:39 November 18

మూడోరోజూ మార్కెట్లపై బేర్​ పంజా- సెన్సెక్స్​ 372 మైనస్​

దేశీయ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 372 పాయింట్ల మేర నష్టపోయింది. చివరకు 59,636 వద్ద స్థిరపడింది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 134 పాయింట్ల క్షీణతతో 17,765 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి..

ఎస్​బీఐ, పవర్​గ్రిడ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​​ లాభాలతో ముగిశాయి.  

టెక్​ మహీంద్ర, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్​, టాటాస్టీల్​, ఎల్​అండ్​ టీ, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​ షేర్లు 2.5 శాతానికిపైగా నష్టాలు మూటగట్టుకున్నాయి.  

14:18 November 18

దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 250 పాయింట్ల నష్టంతో 59,756 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 17,798 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. 

11:46 November 18

సెన్సెక్స్​ 500 డౌన్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ఇవాళ్టి సెషన్​లో భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్​ 500 పాయింట్లకుపైగా నష్టపోయింది. 59 వేల 500 మార్కు దిగువకు చేరింది. 

నిఫ్టీ 170 పాయింట్లకుపైగా నష్టంతో.. 17 వేల 720 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో 3 కంపెనీల షేర్లు తప్ప అన్నీ డీలా పడ్డాయి. 

లాభనష్టాల్లో..

పవర్​ గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. 

టాటా మోటార్స్​, ఎం అండ్​ ఎం, హెచ్​సీఎల్​ టెక్​, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​ నష్టపోయాయి. 

10:29 November 18

సెన్సెక్స్​ 400 డౌన్​..

ఆటో, ఫార్మా, రియల్టీ, లోహ రంగాల్లో ఒడుదొడుకులతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

సెన్సెక్స్​ 400 పాయింట్లకుపైగా పతనమైంది. ప్రస్తుతం.. 59 వేల 600 దిగువన ట్రేడవుతోంది.

నిఫ్టీ 136 పాయింట్లు కోల్పోయి.. 17 వేల 760 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో..

బీఎస్​ఈ- సెన్సెక్స్​ 30 ప్యాక్​లో పవర్​ గ్రిడ్​, ఎన్​టీపీసీ, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ తప్ప అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. హెచ్​సీఎల్​ టెక్​ అత్యధికంగా దాదాపు 3 శాతం మేర నష్టపోయింది.

09:06 November 18

Stock market today: నష్టాల్లోనే మార్కెట్లు..

అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నడుమ దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు (Stock market today) నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో కాస్త లాభాల్లో ట్రేడయినా.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. 

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా నష్టపోయి.. 59 వేల 870 ఎగువన కొనసాగుతోంది. 

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు కోల్పోయి 17 వేల 850 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

హిందాల్కో, ఎస్​బీఐ, శ్రీ సిమెంట్స్​, టైటాన్​ కంపెనీ, గ్రాసిమ్​ కంపెనీల షేర్లు లాభాల్లో (Stock latest news) ఉన్నాయి.

టాటా మోటార్స్​, ఓఎన్​జీసీ, డా.రెడ్డీస్​ ల్యాబ్స్​, ఎం అండ్​ ఎం, మారుతీ సుజుకీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Nov 18, 2021, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details