తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండోరోజూ బుల్​ జోరు- 58వేల ఎగువకు సెన్సెక్స్​

Stock Market Today India: ఒమిక్రాన్​ భయాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్​ మార్కెట్లలో రెండోరోజూ బుల్​ జోరు కొనసాగింది. సెన్సెక్స్​ 750 పాయింట్లకుపైగా లాభంతో 58వేల ఎగువకు చేరింది. నిఫ్టీ 200కుపైగా పాయింట్లు లాభపడింది.

Stock Market Today
స్టాక్​ మార్కెట్​

By

Published : Dec 2, 2021, 3:41 PM IST

Stock Market Today India: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, ఒమిక్రాన్​ భయాలు ఉన్నప్పటికీ వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, లోహ​, స్థిరాస్తి, ఎఫ్​ఎంసీజీ, చమురు-సహజవాయువు​, విద్యుత్ రంగాలకు సంబంధించిన​ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ సూచీలు 1శాతం మేర లాభపడ్డాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ​776 పాయింట్లు లాభంతో 58,461పాయింట్ల వద్ద స్థిరపడింది.

  • ఇంట్రాడేలో.. 57,781 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ లాభాల్లో కొనసాగింది. ఒక దశలో లాభాల స్వీకరణతో 57,680 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి.. కీలక రంగాల్లో మద్దతుతో పుంజుకుంది. కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల 58,513 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 58,461 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 234 పాయింట్ల వృద్ధితో 17,401 వద్ద ముగిసింది.

  • ఇంట్రాడేలో.. 17,183 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒడిదొడుకులకు లోనైంది. ఒకనొక దశలో 17,149 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. కీలక రంగాలు పుంజుకోవటం వల్ల 17,420 పాయింట్ల గరిష్ఠాన్ని చేరి.. చివరకు 17,401 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి...

అదానీ పోర్ట్​ సుమారు 4.5 శాతం మేర లాభపడింది. హెడ్​డీఎఫ్​సీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ 4 శాతం, సన్​ఫార్మా, టాటా స్టీల్​ 2.8 శాతం మేర లాభాలు గడించాయి.

ఐసీఐసీ బ్యాంక్​, సిప్లా, యాక్సిస్​ బ్యాంక్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details